: మోదీయే కాదు... మరెవరూ గాంధీకి సరిరారు, రాలేరు: కేంద్రమంత్రి కల్ రాజ్ మిశ్రా
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ విడుదల చేసిన 2017 క్యాలెండర్, డైరీలపై రాట్నం తిప్పుతున్న మోదీ చిత్రాలను ప్రచురించడం తీవ్ర విమర్శలకు, ఉద్యోగుల నిరసనలకు దారితీయగా, పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. మహాత్మాగాంధీని మరిపించగల వ్యక్తి మరెవరూ లేరని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్ రాజ్ మిశ్రా వ్యాఖ్యానించారు. అందుకు మోదీ కూడా మినహాయింపేమీ కాదని, మరెవరూ గాంధీకి సరిరారని, రాలేరని అన్నారు. "ఆయన జాతిపిత. ఖాదీ అంటే గుర్తొచ్చేది గాంధీయే. గతంలో ఎన్నోమార్లు కేవీఐసీ క్యాలెండర్ గాంధీ చిత్రం లేకుండా వచ్చింది" అని అన్నారు.