: అమితాబ్ తర్వాత చిరంజీవిని చూసే అలా ఫీలయ్యా!: దర్శకుడు వి.వి. వినాయక్
ఒక మనిషికి పట్టుదల ఉంటే వయసు అనేది కొలమానం కాదనే విషయం బాలీవుడ్ నటుడు అమితాబ్ ను చూసి ఫీలయ్యేవాడినని, ఆ తర్వాత చిరంజీవిని చూసి అదే ఫీలవుతున్నానని ‘ఖైదీ నంబరు 150’ చిత్ర దర్శకుడు వి.వి. వినాయక్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ విషయాన్ని చిరంజీవి గారు ప్రూవ్ చేశారు. ఆయనని అందరూ మార్గదర్శకంగా తీసుకోవాలి. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా చేసినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు కనపడలేదు. ఫారిన్ షూటింగ్ కు వెళ్లినప్పుడు ఆయన పద్నాలుగు గంటల పాటు పని చేసేవారు. యువ దర్శకులందరికి చిరంజీవి గారితో పనిచేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఆ అవకాశం వారికి లభిస్తే చిరంజీవి సినిమా విడుదల రోజున ఉండే ‘కిక్కు’ ఏంటనేది వారికి తెలుస్తుంది’ అని వినాయక్ అన్నారు.