: కోడి పందేల్లో గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్టు
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో కోడి పందేల ప్రారంభం సందర్భంగా ఒక వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపి కలకలం రేపిన సంఘటన తెలిసిందే. ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం వాసి గంగవరపు లక్ష్మీదయాకర్ తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ రివాల్వర్ తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేశారు. అతనితో పాటు కోడి పందేల నిర్వాహకుడు పోల్నాటి బాబ్జీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి రివాల్వర్, ఏడు తూటాలు, రూ.1.64 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.