: ఆమెతో నాకు ఎలాంటి విభేదాలు లేవు: షాహిద్ కపూర్
హీరోయిన్ కంగనా రనౌత్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అన్నాడు. 'రంగూన్' సినిమాలో వీరిద్దరూ కలసి నటించారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడు. ఫిబ్రవరి 24న విడుదల కానున్న ఈ సినిమా... ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉంది. ఈ నేపథ్యంలో షాహిద్ కపూర్ మాట్లాడుతూ, ప్రమోషన్ ఎప్పుడు, ఎక్కడ పెట్టినా వెళ్తానని... సైఫ్, కంగనాలతో కలసి అందులో పాల్గొంటానని చెప్పాడు. షాహిద్, కంగనాలు తొలిసారిగా ఈ సినిమాలోనే కలసి నటించారు.