: వర్మ ట్వీట్ల వ్యవహారంలోకి నన్ను లాగొద్దు: క్రిష్
'గౌతమీపుత్ర శాతకర్ణి'పై ప్రశంసలు కురిపిస్తూ, 'ఖైదీ నంబర్ 150'పై విమర్శలు గుప్పిస్తూ ట్విట్టర్లో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ నేపథ్యంలో 'శాతకర్ణి' దర్శకుడు క్రిష్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన ప్రశ్నను ఎదుర్కొన్నాడు. వర్మ వరుసగా ట్వీట్లు పెడుతుండటానికి మీపై ప్రేమా? లేక 'ఖైదీ'పై కోపమా? అనే ప్రశ్న క్రిష్ కు ఎదురైంది. దీంతో, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని... తనను అనవసరంగా ఆ వ్యవహారంలోకి లాగొద్దని అభ్యర్థించాడు. అయితే, తన దర్శకత్వ ప్రతిభను పొగుడుతూ ట్వీట్ చేసిన వర్మకు థ్యాంక్స్ చెబుదామనుకున్నానని... అయితే, ఇది సరైన సమయం కాదనుకుని ఆగిపోయానని చెప్పాడు.