: సీఎం చంద్రబాబును కలిసిన జేసీ దివాకర్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ఈరోజు ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయన, ముచ్చుమర్రి, పులివెందులకు నీటి విడుదల, తదనంతర పరిణామాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును త్వరలో పరిశీలించనున్నట్లు చెప్పిన ఆయన, కోస్తా ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయన్నారు.