: భోగి మంటల పొగలు..ఆలస్యంగా నడిచిన విమానాలు!
‘పొంగల్’ సందర్భంగా తమిళనాడులో ప్రజలు భోగి పండగ ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. దీంతో, పొగలు విపరీతంగా వ్యాపించాయి. దీని ప్రభావం విమానాల రాకపోకలపై పడింది. దుబాయ్ నుంచి చెన్నైకి రావాల్సిన విమానాన్ని కొచ్చికి మళ్లించగా, సుమారు 19 అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఆలస్యంగా నడిచినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. మస్కట్, మారిషస్, కొలంబో తదితర ప్రాంతాలకు వెళ్లాల్సినవి, అటునుంచి రావాల్సిన విమానాలు దాదాపు రెండు గంటల పాటు ఆలస్యమయ్యాయని తెలిపారు.