: కేంద్ర బడ్జెట్ పై పిటిషన్ ను 20న విచారిస్తాం : సుప్రీం
కేంద్ర ప్రభుత్వం వచ్చేనెల 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోన్న వేళ ఆ బడ్జెట్ తేదీలను వాయిదా వేయాలని, లేకుంటే ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉంటుందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే, ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు దాన్ని జనవరి 20న విచారించనున్నట్లు పేర్కొంది. కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇదే పిటిషన్‌పై స్పందిస్తూ.. దాన్ని అత్యవసరంగా విచారించాలన్న అవసరం లేదని, సమయం వచ్చినప్పుడే విచారిస్తానని కూడా తేల్చి చెప్పింది.