: కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేందుకు స‌రైన స‌మ‌యం కోసం ఇన్నాళ్లూ ఎదురు చూశా: ధోనీ


ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు బ‌లంగా ఉంద‌ని, అన్ని ఫార్మాట్ల‌లోనూ రాణించే సామ‌ర్థ్యం జ‌ట్టుకి ఉంద‌ని టీమిండియా స్టార్ ఆట‌గాడు మ‌హేంద్ర సింగ్ ధోనీ అన్నాడు.  టీమిండియా-ఇంగ్లండ్ మ‌ధ్య ఎల్లుండి నుంచి వ‌న్డే సిరీస్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ రోజు పుణెలో నిర్వ‌హించిన‌ మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడాడు. అన్ని ఫార్మాట్లలో ఒకే వ్య‌క్తి కెప్టెన్‌గా ఉండ‌డం మంచిదని ధోనీ అభిప్రాయ‌ప‌డ్డాడు. వన్డేలకు ఒకరు, టెస్టులకు ఒకరు సారథ్యం వహించడం వల్ల లాభం లేదని వ్యాఖ్యానించాడు.

అన్ని ఫార్మాట్ల‌లోనూ కెప్టెన్ విరాట్ కోహ్లీకి జ‌ట్టుని న‌డిపించే సామ‌ర్థ్యం ఉంద‌ని చెప్పాడు. తాను నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు దిగేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నాడు. జ‌ట్టుకి అవ‌స‌ర‌మైనప్పుడు లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో ఆడేందుకు కూడా రెడీగా ఉన్నాన‌ని చెప్పాడు. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేందుకు స‌రైన స‌మ‌యం కోసం ఇన్నాళ్లూ ఎదురు చూశానని, ప్రస్తుతం ఆ సమయం వచ్చిందని భావించి జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నానని చెప్పాడు. 

  • Loading...

More Telugu News