: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో కలకలం... ఆరుగురు ప్రభుత్వ అధికారులను అపహరించిన మావోయిస్టులు
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతమయిన పనసపుట్టు వద్ద ఈ రోజు ఉదయం కలకలం రేగింది. ఆ ప్రాంత పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ పత్రాలను పరిశీలించడానికి ప్రభుత్వ అధికారుల బృందం వెళ్లిన సమయంలో అక్కడికి ప్రవేశించిన మావోయిస్టులు వారిని అపహరించారు. అపహరణకు గురయిన వారిలో గ్రామీణ నీటి సరఫరా విభాగం జేఈ సహా ఆరుగురు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని పోలీసులను వెంటనే అప్రమత్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.