: సైన్యానికి మరో అస్త్రం... పినాకా క్షిపణి పరీక్ష విజయవంతం


పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) తయారు చేసిన గైడెడ్ మిసైల్ 'పినాకా రాకెట్' ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ ఐటీఆర్ (ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్) నుంచి దీన్ని ప్రయోగించగా, లక్ష్యాన్ని ఛేదించిందని అధికారులు తెలిపారు. నావిగేషన్ వ్యవస్థ ఈ క్షిపణి ప్రత్యేకత. దీని సాయంతో కచ్చితమైన లక్ష్యాలను ఇది సులువుగా చేరుకుంటుందని అధికారులు తెలిపారు. క్షిపణి ప్రయాణాన్ని రాడార్లతో నిశితంగా పరిశీలించామని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు జీ సతీశ్ రెడ్డి స్వయంగా వీక్షించారు. పినాకా క్షిపణి విజయవంతం కావడంపై రక్షణమంత్రి మనోహర్ పారికర్, డీఆర్డీఓ చైర్మన్ ఎస్ క్రిస్టోఫర్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News