: ఢిల్లీలో 120 మంది బీజేపీ కౌన్సిలర్ల అరెస్ట్
ఢిల్లీలో 120 మంది బీజేపీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు ఆందోళన చేస్తుండటంతో వీరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ పారిశుధ్ధ్య కార్మికులకు వెంటనే జీతభత్యాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వీరంతా నిరసనకు దిగారు. బీజేపీ సీనియర్ కౌన్సిలర్ సుభాష్ ఆర్యా ఆధ్వర్యంలో ఈ ధర్నాను నిర్వహించారు. నినాదాలు చేస్తూ, ఆందోళనకు దిగడంతో... పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీంతో, వారిని పోలీసులు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.