: అరచేతిలో టెక్నాలజీ... కోడిపందాల బరుల వద్ద స్వైపింగ్ మెషీన్లు
పందెం రాయుళ్లు, నిర్వాహకులు టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. కోర్టులు నిషేధించినా, పోలీసుల బందోబస్తు కొనసాగుతున్నా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు, కృష్ణా జిల్లాలోని లంక ప్రాంతాల్లో వందలాది బరులు ఏర్పాటయ్యాయి. ఈ దఫా పందాలు స్వైపింగ్ మెషీన్ల ద్వారా జరుగుతూ ఉండటం గమనార్హం. పందెం రాయుళ్లు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో చెల్లింపులు జరుపుతున్నారు. ఇందుకోసం బరుల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి, నరసాపురం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇంక ఈ మూడు రోజులూ కోడి పందాల బరుల వద్దకు పోలీసులు వెళ్లకుండా చూసేందుకు ప్రభుత్వ పెద్దల నుంచి అనధికార ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.