: ‘శాతకర్ణి’ని వీక్షించిన ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబ సభ్యులు.. బాగుందని ప్రశంస
నందమూరి బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని గురువారం సాయంత్రం ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబ సభ్యులు వీక్షించారు. తిరుపతిలోని మినీ ప్రతాప్ థియేటర్ లో ఎన్టీఆర్ కుమార్తెలు లోకేశ్వరి, ఉమామహేశ్వరి, సీఎం చంద్రబాబు సోదరి హైమావతి, సోదరుడు రామ్మూర్తినాయుడు సతీమణి ఇందిర, ఎన్టీఆర్ చిన్నల్లుడు కంఠమనేని శ్రీనివాసరావు, మనవడు శ్రీనివాస్, ఎన్టీఆర్ కుమార్తె అల్లుడు శ్రీమాన్, చంద్రబాబు మేనల్లుడు కనుమూరి ఉదయ్, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, అల్లుడు భరత్ తదితరులు సినిమాను వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.