: నాకు వద్దంటే బలవంతంగా పదవి కట్టబెట్టారు.. నన్నపనేని ఆసక్తికర వ్యాఖ్యలు


తనకు వద్దంటే బలవంతంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ పదవిని ఇప్పించారని టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం రాత్రి గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. దేవినేని ఉమా మహేశ్వరావు తదితరులు తనకు బలవంతంగా పదవి ఇప్పించారని తెలిపారు. తనకు పదవి ఇచ్చి నోరు కట్టేశారన్నారు. తాను ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, పార్టీ తరపున టీవీలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడకూదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తనను కలిసిన దేవినేని పదవి ఎలా ఉందని అడిగారని, నాలుగేళ్ల తర్వాత వైజాగ్ పిచ్చాస్పత్రికి వచ్చి నన్నపనేని గురించి అడిగితే చెబుతారని తాను సమాధానం చెప్పానని నన్నపనేని చమత్కరించారు.

  • Loading...

More Telugu News