: కేంద్ర మంత్రి పాశ్వాన్ కు అస్వస్థత .. ఐసీయూలో చికిత్స!
కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత రాం విలాస్ పాశ్వాన్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఈరోజు సాయంత్రం పాట్నాలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పాశ్వాన్ సోదరుడు, బీహార్ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ మాట్లాడుతూ, పాశ్వాన్ శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడటంతో, ఈరోజు రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఆయన్ని ఆసుపత్రికి తరలించామని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని చెప్పారు. పాశ్వాన్ భార్య, కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఆయనతో ఉన్నారు. ఇదిలా ఉండగా, నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు పాశ్వాన్ ఇక్కడికి వచ్చారు. పాట్నా, ఖగారియా, బెగూసరాయ్, మొకామా లో రాజకీయ సమావేశాల నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చారు.