: ఎన్టీఆర్ కు మనవలుగా పుట్టడమే మా అదృష్టం: నారా లోకేశ్, బ్రహ్మణి


ఎన్టీఆర్ కు మనవలుగా పుట్టడమే తమ అదృష్టమని నారా లోకేశ్, బ్రహ్మణి అన్నారు. ఈరోజు వారు మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ నేర్పిన విలువలతో జీవించాలన్నదే తమ ఉద్దేశమని, అమరావతిలో ఎన్టీఆర్ మ్యూజియం నిర్మిస్తామని తెలిపారు. ఈ మ్యూజియంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలు సహా దక్షిణ భారత చలనచిత్ర చరిత్రను భద్రపరుస్తామని, ఆదర్శనీయమైన వారసత్వాన్ని పదిలంగా ఉంచాలన్నదే తమ ఆశయమని చెప్పారు. తెలుగు వారికి ఎన్టీఆర్ చేసిన సేవలను రేపటి తరాలు గుర్తుపెట్టుకునేలా చేయడం మన అందరి బాధ్యత అని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News