: పెద్ద‌నోట్ల రద్దు, డొనాల్డ్‌ట్రంప్‌ ఎన్నికపై పాట పాడిన ఏఆర్‌ రెహమాన్‌.. అభిమానుల నుంచి విపరీతంగా స్పందన


ముంబ‌యిలో ఎంటీవీ నిర్వహించిన 2017 అన్‌ప్లగ్‌డ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు ఏఆర్‌ రెహమాన్ పెద్దనోట్ల రద్దుపైన, అమెరికా కొత్త అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పైన పాట పాడారు. మరో ఇద్దరు గాయకులతో కలిసి ఈ పాటలు పాడారు. ముందుగా తాను సంగీతం అందించిన ‘ప్రేమికుడు’  చిత్రంలోని ‘ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ పాలసీ’ పాటను, బొంబాయిలోని ‘హమ్మా హమ్మా’ పాటల రీమిక్స్‌ వెర్షన్‌లను పాడాడు. అనంత‌రం అవే ట్యూన్స్ లో లిరిక్స్‌ మార్చి బార‌త్‌లో పెద్ద‌ నోట్లరద్దు, అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికపై పాట పాడారు. ఈ పాట‌కి విప‌రీతంగా స్పంద‌న వచ్చింది.

పాత‌ రూ.500 నోట్లు భార‌త్ లో ఇక చెల్ల‌వ‌ని.. టేక్‌ ఇట్‌ ఈజీ పాలసీ.. అంటూ పాట అందుకున్నారు రెహమాన్. అనంత‌రం అమెరికాకు డొనాల్డ్‌ ట్రంప్‌ ‌అధ్యక్షుడయినా.. టేక్‌ ఇట్‌ ఈజీ పాలసీ అంటూ గానం ఆల‌పించారు. ఈ పాటను ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు. ఇలా పోస్టు చేశాడో లేదో 2,700కు పైగా రీట్వీట్లు, 1,400 పైగా లైకులు వచ్చిప‌డ్డాయి. మ‌రో సోష‌ల్ మీడియా సైట్ ఫేస్‌బుక్‌లో ఉంచిన ఈ వీడియోని ఇప్ప‌టికే 65,000 మంది చూశారు.


  • Loading...

More Telugu News