: ఫిబ్రవరి 3 నుంచి ఆ ఫీచర్ ని తొలగిస్తున్న ‘ట్విట్టర్’!
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్.. బిజినెస్ యాప్స్ కేటగిరిలో ‘డ్యాష్ బోర్డు’ అనే ఫీచర్ ను 2016 జూన్ లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ ను ఎక్కువ మంది యూజర్లు ఇన్ స్టాల్ చేసుకోకపోవడంతో దానిని తొలగిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ యాప్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం నలభై వేల సార్లు మాత్రమే యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారని, బిజినెస్ యాప్స్ కేటగిరిలో కూడా ‘డ్యాష్ బోర్డు’కు చాలా తక్కువగా 432 ర్యాంకు నమోదైందని పేర్కొంది. ‘డ్యాష్ బోర్డు’ ఫీచర్ ను ఈ ఫిబ్రవరి 3 నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టు వెల్లడించింది. భవిష్యత్తులో ట్విట్టర్ కమ్యూనిటీ బోర్డర్ లో మంచి ఫీచర్లను తీసుకొస్తామని తాము ఆశిస్తున్నట్లు ట్విట్టర్ డ్యాష్ బోర్డు పలు ట్వీట్ల ద్వారా తెలిపింది.