: శత చిత్ర యోధుడు ఇరగదీశాడట... యూఎస్ రిపోర్టు వచ్చిందంటున్న అభిమానులు
శత చిత్ర యోధుడు బాలకృష్ణ , తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో అద్భుతంగా నటించాడని, ఈ మేరకు అమెరికా నుంచి తమకు రిపోర్టులు అందుతున్నాయని అభిమానులు సంబరంగా చెబుతున్నారు. ఈ తెల్లవారుజామున విజయవాడ బస్టాండులోని వైస్క్రీన్ థియేటర్లలో చిత్రం బెనిఫిట్ షోలు ప్రారంభం కాగా, అక్కడికి వచ్చిన అభిమానులు మీడియాతో మాట్లాడారు. తమ హీరో ఈ చిత్రంలో ఇరగదీశాడని, డైలాగులు సూపరని విదేశాల్లో ఉంటున్న తమ మిత్రుల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని సంబరంగా తెలిపారు. విజయవాడలో ఈ చిత్రం ప్రీమియర్ షోలు పలు థియేటర్లలో ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యాయి.