: ఫిల్మ్ నగర్లో పీజేఆర్ విగ్రహం తొలగింపులో ఉద్రిక్తత .. రోడ్డుపై బైఠాయించిన పీజేఆర్ కూతురు!


హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కూడలి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ దివంగత నేత పి.జనార్దన్ రెడ్డి విగ్రహం తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ విగ్రహాన్ని తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి రావడంతో, పీజేఆర్ కుమార్తె, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయ రోడ్డుపై అడ్డంగా బైఠాయించారు. కాగా, పీజేఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశం తమ డివిజన్ పరిధిలోకి వస్తుందని, దాన్ని వెంటనే తొలగించాలని షేక్ పేట ఎంఐఎం కార్పొరేటర్ ఫరాజుద్దీన్ ఈమేరకు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆ విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులు అక్కడికి వెళ్లడం జరిగింది.

  • Loading...

More Telugu News