: ఐసిస్ అఘాయిత్యం.. ‘గే’ అని ఆరోపిస్తూ భవనం పై నుంచి తోసేశారు!
ఐసిస్ ఉగ్రవాదుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. తమ అధీనంలో ఉన్న ఓ ఖైదీని ‘గే’ (స్వలింగ సంపర్కి) అని ఆరోపిస్తూ ఓ భవనం పై నుంచి కిందకి తోసేసిన సంఘటన ఇరాక్ లోని మోసుల్ నగరంలో చోటుచేసుకుంది. డెయిలీ మెయిల్ కథనం ప్రకారం, సదరు ఖైదీ కళ్లకు గంతలు కట్టి భవంతిపైకి తీసుకువెళ్లారు. ఆ తర్వాత, అతని కాళ్లూచేతులు కట్టేశారు. అతనిపై ఉన్న నేరారోపణలు చదివిన అనంతరం, భవనం పై నుంచి తోసేశారని పేర్కొంది. ఐఎస్ చట్టం ప్రకారం, గే లకు మరణశిక్ష విధిస్తారు. బహిరంగంగా అందరి చేత రాళ్లతో కొట్టించడం లేదా, భవంతిపై నుంచి తోసేయడం ద్వారా వారికి మరణ శిక్ష విధిస్తారు.