: పరిణీతి చోప్రా 'గొడుగు'పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. 'మేరీ ప్యారీ బిందు' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పరిణీతి దుబాయ్ బీచ్ లో నడుస్తూ ఫ్యాన్స్ ను విష్ చేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అభిమానులంతా తెగ ఆనందపడతారని... అభినందిస్తారని భావించిన పరిణీతికి ఊహించని విధంగా ఝలక్కిచ్చారు. అసలు నీకు బుద్ధుందా? అంటూ విమర్శలతో ధ్వజమెత్తారు. దీంతో తన తప్పు తెలుసుకున్న పరిణీతి ఏకంగా వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా నుంచి డిలీట్ చేసేసింది.
నెటిజన్లను అంత ఆగ్రహానికి గురిచేసిన ఆ విషయం ఏంటంటే...ఆ వీడియోలో పరిణీతి మాట్లాడుతుండగా, ఆమె అసిస్టెంట్ ఆమెకు గొడుగు పడుతూ నడిచాడు. ఆ సమయంలో అతను భుజాన మూడు బ్యాగులు మోస్తున్నాడు. ఓపక్క మూడు బ్యాగులు (వాటిలో పరిణీతి హ్యాండ్ బ్యాగ్ కూడా వుంది) మోస్తూ, మరోపక్క హీరోయిన్ గారికి ఎండ తగలకుండా అసిస్టెంట్ గొడుగు పట్టడం పట్ల నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తూ, పరిణీతిపై ఫైరయ్యారు. దీంతో గొడుగు మరీ వంద కేజీల బరువుండదు, నువ్వు పట్టుకోవచ్చు అంటూ కొందరు సెటైర్ వేస్తే ... 'గొడుగు నీకు నువ్వు పట్టుకుంటే నీ స్థాయి తగ్గిపోదు' అని మరికొందరు కామెంట్లు పెట్టారు.