: ఈసీ నోటీసులకు వివరణ ఇచ్చిన సాక్షి మహరాజ్


మీరట్ సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం నోటీసు జారీ చేయడంతో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వివరణ ఇచ్చారు. ఈ రోజు ఎన్నికల అధికారులను కలిసి వివరణ ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో తాను జనాభా నియంత్రణ గురించే మాట్లాడానని... ఏ వర్గం పేరును తాను ప్రస్తావించలేదని ఈ సందర్భంగా అన్నారు. మహిళలు పిల్లలను కనే యంత్రాలు కాదని... దేశంలో జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయినా తాను మాట్లాడింది ఎన్నికల ర్యాలీలో కాదని...  సాధువులు ఏర్పాటు చేసిన సభలో అని చెప్పారు. కాగా, దేశ జనాభా పెరగడానికి ఓ వర్గమే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో... ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News