: అశోక్ గజపతిరాజుకు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు అనుమతి ఇచ్చినందుకు కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్... అశోక్ తో ఈ ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద ఏవియేషన్ స్కిల్లింగ్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో, ప్రాంతీయ విమానయాన అనుసంధానం కింద కేంద్ర విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా విమానయాన రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ లో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం చాలా కీలకమైనదని తెలిపారు.