: కేజ్రీవాల్ పంజాబ్ వెళ్లరు... విమర్శలు చుట్టుముట్టడంతో స్పందించిన ఆప్


"పంజాబ్ కు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కావాలనుకుంటే, ఆప్ ను గెలిపించండి" అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపగా, ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. పంజాబ్ లో తమ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినా, ఢిల్లీకి ముఖ్యమంత్రిగానే కేజ్రీవాల్ కొనసాగుతారని, పంజాబ్ కు వెళ్లబోరని స్పష్టం చేసింది. పంజాబ్ లో కేజ్రీవాల్ నేతృత్వంలోనే తాము ఎన్నికలకు వెళతామని, అంతమాత్రాన సీఎం పదవిని ఆయన ఆశిస్తున్నట్టు కాదని ఆప్ నేత ఆతిష్ మర్లీనా వ్యాఖ్యానించారు. సీఎంగా కేజ్రీవాల్ అంటే, కేజ్రీవాల్ తరహా ఆమ్ ఆద్మీ పాలన వస్తుందన్న భావనలోనే సిసోడియా మాట్లాడారని, కేజ్రీవాలే రాష్ట్రానికి ముఖ్యమంత్రన్న భావనతో ఆయన ప్రసంగించలేదని అన్నారు.

  • Loading...

More Telugu News