: ఏడు నెలల తర్వాత పార్టీ కార్యాలయానికి వస్తున్న చంద్రబాబు


సుమారు 7 నెలల విరామం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు వస్తున్నారు. మేడే సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగే వేడుకల్లో బాబు పాల్గొంటారు. 'వస్తున్నా మీకోసం' పేరుతో ఇన్నిరోజులు రాష్ట్రమంతటా బాబు పాద యాత్ర చేశారు. ఏప్రిల్ 27న విశాఖలో పాదయాత్ర ముగించారు. అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా వారంరోజులు విశ్రాంతి తీసుకోవాలని ముందు అనుకున్నారు. కానీ, మే డే సందర్భంగా ఈ రోజు పార్టీ కార్యాలయానికి రావాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News