: త్వరలో మార్కెట్లోకి ఆసుస్ జెన్‌ఫోన్ 3 జూమ్.. ధర రూ.36,400
తైవాన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఆసుస్ త్వరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఆసుస్ జెన్‌ఫోన్ 3 జూమ్ పేరుతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.36,400. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్ ప్లే, గొరిల్లా గ్యాస్ 5, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 625 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, శక్తిమంతమైన 5000 ఎంఏమెచ్ బ్యాటరీ, 12 మెగాపిక్సల్ రియర్ కెమెరాలు రెండు, 13 మెగాపిక్సల్‌తో ఫ్లాష్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు.