: అమెరికా అధ్యక్షుడిగా ఒబామా చివరి ప్రసంగం.. భావోద్వేగంతో మాట్లాడుతున్న ఒబామా
అమెరికా అధ్యక్ష హోదాలో బరాక్ ఒబామా చివరి ప్రసంగం ప్రారంభమైంది. చికాగోలో ఆయన ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంగా మాట్లాడుతున్నారు. ప్రజల మద్దతు వల్లే మంచి అధ్యక్షుడిగా మంచి పేరు తెచ్చుకున్నానని, అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు తెలిపారు. అమెరికా అత్యంత శక్తిమంతమైన దేశమని పేర్కొన్న ఒబామా దేశంలో పేదరికం తగ్గిపోయిందన్నారు. అధికార మార్పిడి సాఫీగా జరుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు స్పందించినప్పుడే మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.