: జవాను తేజ్‌బహదూర్ యాదవ్‌కు బాలీవుడ్ ప్రముఖుల మద్దతు
దేశం కోసం సరిహద్దుల్లో అహర్నిశలు కష్టపడుతున్న తమకు నాణ్యతలేని ఆహారాన్ని పెడుతున్నారంటూ సంచలన వీడియో బయటపెట్టిన జవాను తేజ్‌బహదూర్‌కు బాలీవుడ్ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. సరిహద్దు భద్రతా దళంలోని 29 బెటాలియన్‌కు చెందిన తేజ్‌బహదూర్ యాదవ్ సైనికులకు పెడుతున్న భోజనం ఎంత నాసిరకంగా ఉందో చూపిస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంచలన వీడియో బయటపెట్టిన తేజ్‌బహదూర్‌పై ఉన్నతాధికారులు గుర్రుగా ఉంటే బాలీవుడ్ ప్రముఖులు రితేశ్ దేశ్‌ముఖ్, పర్హాన్ అక్తర్, వరుణ్ ధావన్ తదితరులు రీట్వీట్లతో అతడికి అండగా నిలిచారు.
ఇది నిజంగా చాలా బాధాకర విషయమని, తనకోసం కాకుండా జవాన్లందరు ఎదుర్కొంటున్న సమస్యను బయటపెట్టిన అతడికి సెల్యూట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అతడు బయటపెట్టిన విషయాన్ని రాజకీయం చేయకుండా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఫర్హాన్ అక్తర్ ప్రభుత్వాన్ని కోరాడు. అయితే బీఎస్ఎఫ్ అధికారులు మాత్రం తేజ్‌బహదూర్ ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. అతడికి తాగే అలవాటుందని, ప్రమోషన్ రాకపోవడంతో నిరాశతోనే ఇలా చేశాడని ఆరోపిస్తున్నారు.