: గర్భవతిని కళ్లు అప్పగించి చూసిన ఒరాంగుటాన్!..ఆ వీడియో ఇదిగో!


హోమినిడే వర్గానికి చెందిన రెండు జాతుల కోతులను కలిపి ఒరాంగుటాన్ అని వ్యవహరిస్తుంటారు. తెలివితేటలకు మారుపేరైన ఒరాంగుటాన్ కు ఎమోషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఇంగ్లాండులోని కోల్చెస్టర్ జూలో జరిగిన ఈ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఇంగ్లాండ్ కు చెందిన భార్యాభర్తలు ఇటీవల ఆ జూను సందర్శించారు. ఏడు నెలల గర్భవతి అయిన ఆమెను చూసిన ఒరాంగుటాన్ విచిత్రంగా స్పందించింది. ఆమెకు చాలా దగ్గరగా వచ్చి (అడ్డుగా గాజుతో చేసిన గ్లాసు ఉంది)న ఒరాంగుటాన్ కళ్లు అప్పగించి అలానే చూస్తూ నిలబడిపోయింది. కొంతసేపటి తర్వాత ఆమె కడుపుపై తన చేతులతో ముట్టుకోవడం, ముద్దుపెట్టుకోవడం చేసింది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోను ఆ జంట సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారింది.


 

  • Loading...

More Telugu News