: డార్జిలింగ్ కొండలను చూపే టాయ్ ట్రైన్ పట్టాలు తప్పింది!
పశ్చిమబెంగాల్ ను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు డార్జిలింగ్ కనుమల అందాలను తిప్పి చూపే టాయ్ ట్రైన్ పట్టాలు తప్పింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన డార్జిలింగ్ కు వచ్చేవారంతా ఈ ట్రైన్ లో ప్రయాణించి డార్జిలింగ్ కొండల అందాలు చూస్తారు. ఈ ట్రైన్ పట్టాలు తప్పడంతో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ లో పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వారు పేర్కొన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వారు తెలిపారు.