: తమ సోదరిని వేధిస్తున్నాడని అతని చేయి నరికి ... పట్టుకుపోయారు!


గతంలో ఓ యువతిని అపహరించి అతను నేరానికి పాల్పడ్డాడు.. పోలీసులకి చిక్కి జైలుకు కూడా వెళ్లాడు. తిరిగి ఇంటికి వ‌చ్చాడు.. మ‌ళ్లీ త‌న బుద్ధిని చూపిస్తూ మరో యువ‌తిని వేధించాడు. దీంతో ఆ యువ‌తి సోద‌రుల ఆగ్ర‌హానికి గుర‌యిన ఆ వ్య‌క్తి త‌న చేయిని పోగొట్టుకున్నాడు. వివ‌రాల్లోకి వెళితే, గోరఖ్‌పూర్‌లోని సింధులీ బిందులీ అనే గ్రామంలో రాజ్‌మన్ అనే ఓ వ్య‌క్తి జైలుకి వెళ్లి వ‌చ్చిన అనంత‌రం కూడా ఓ వివాహితను వేధించాడు. ఆమెకు ఫోన్ చేస్తూ అస‌భ్యంగా మాట్లాడుతున్నాడు.

ఈ విష‌యాన్ని తెలుసుకున్న ఆ యువ‌తి ముగ్గురు సోద‌రులు ఆ వ్య‌క్తిని ప‌ట్టుకొని అత‌డి చేయి నరికేశారు. రాజ్‌మన్‌ కాలువగట్టు దగ్గర ఉండగా ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లిన ఆ యువ‌తి సోద‌రులు అతడిపై దాడి చేసి, చేయి నరికేసి దాన్ని తీసుకొని పారిపోయారు. ఈ దాడితో రాజ్‌మ‌న్‌ రక్తపు మడుగులో అక్క‌డే ప‌డిపోయాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి అతనిని ఆసుప‌త్రిలో చేర్చారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల‌ కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News