: జీతాలు పెంచాలంటూ టీటీడీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన.. టీటీడీ చైర్మన్ చదలవాడ నివాసం ముట్టడి


తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నివాసాన్ని టీటీడీ కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. జీతాలు పెంచాలని, లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలోని ఆయన నివాసాన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో ముట్టడించారు. అయితే ఆ సమయంలో నాయుడుపేటలో జరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో చదలవాడ ఉన్నారు. దీంతో, అక్కడున్న వారు ఫోన్ ద్వారా టీటీడీ ఛైర్మన్ తో మాట్లాడించడంతో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన విరమించారు. 

  • Loading...

More Telugu News