: అనకాపల్లి ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసిన పోలీసులు
అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ, ఆయన అనుచరులపై ఈ రోజు ఉదయం పోలీసులు కేసు నమోదు చేశారు. తమ ఇంటి ప్రహారీగోడ ప్రధాన ద్వారాన్ని సదరు ఎమ్మెల్యే అనుచరులు పొక్లెయిన్ తో కూల్చివేశారని రాజేశ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పెందుర్తి పోలీసులు తెలిపారు. ఒమన్ ప్రాంతం నుంచి పోలీసు కమిషనర్‌కు రాజేశ్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడని, దీంతో కమిషనర్ ఆదేశాలతో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.