: ఉమ్మడిగా ఉన్నప్పుడే నయం... ఇప్పుడు సీమాంధ్ర నిర్మాతలకే పన్ను మినహాయింపు ఇస్తున్నారు: తెలంగాణ దర్శకుడి ఆవేదన


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఇక్కడి నిర్మాతలు, దర్శకుల గోడు పట్టించుకోవడం లేదని సినీ దర్శకుడు సయ్యద్ రఫీ ఆందోళన వ్యక్తం చేశాడు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే చిత్రాలకు, చారిత్రక పోరాటాలను తెరకెక్కించిన చిత్రాలకు, తక్కువ బడ్జెట్ లో రూపొందిన చిత్రాలకు పన్ను మినహాయింపులు లేవు సరికదా, కనీసం థియేటర్లు కూడా లభించడం లేదని వాపోయాడు. సీమాంధ్ర నిర్మాతలు తీసిన పెద్ద చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపులను క్షణాల్లో మంజూరు చేస్తోందని ఆరోపించాడు.

రుద్రమదేవి, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు పన్ను మాఫీ ప్రోత్సాహకాలు ఇవ్వడం అవసరమా? అని ప్రశ్నించిన ఆయన, అసభ్య, అసహజ సన్నివేశాలు ఉన్నాయా? లేవా? అని కూడా చూడకుండా ప్రభుత్వం జీవోలు ఇస్తోందని, వేరుపడ్డాక కూడా తెలంగాణ బిడ్డలపట్ల వివక్ష చూపితే ఎలాగని నిలదీశాడు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయాలు వెంటనే అమలయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నాడు. కేసీఆర్ తో పాటు ఇతర మంత్రులు సైతం సీమాంధ్ర నిర్మాతల చిత్రాలకు ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించాడు. ప్రభుత్వ వైఖరి తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని, తెలంగాణ నిర్మాత, దర్శకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించాడు.

  • Loading...

More Telugu News