: సంక్రాంతి సెలవులు మారాయి... 11 నుంచి కాదు.. 12 నుంచి.. విద్యాశాఖ తాజా ప్రకటన
సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చేస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సోమవారం మరో ప్రకటన చేసింది. తొలుత ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం 16న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే సెలవుల సందర్భంగా దూర ప్రాంతానికి వెళ్లే ఉపాధ్యాయులు, విద్యార్థులు తిరిగి 16న స్కూలుకు చేరుకోవాలంటే పండుగనాడే బయలుదేరాల్సి ఉండడంతో సెలవుల్లో స్వల్ప మార్పులు చేసింది. 11వ తేదీకి బదులు సెలవులు 12 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. పాఠశాలలు తిరిగి 17న పునఃప్రారంభమవుతాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.