: సినీ పరిశ్రమలో లక్కులేనోడు మోహన్ బాబు: పోసాని
'సినీ పరిశ్రమలో లక్కులేనోడు మోహన్ బాబు' అని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. హైదరాబాదులో జరిగిన లక్కున్నోడు సినిమా ఆడియో వేడుకలో మాట్లాడుతూ, మోహన్ బాబును చిన్నతనం నుంచి గమనిస్తున్నానని, ఆయనంత అందం, వాచకం లేనివారంతా అందలాలు ఎక్కినా ... ఆయన మాత్రమే ఇతరులంత విజయవంతం కాలేకపోయారని అన్నారు. అందుకే మోహన్ బాబు లక్కులేనోడని ఆయన చెప్పారు. తాను రచయితగా ఉన్నప్పుడు ఆయనకు సరైన కథ రాయలేకపోయానని ఆయన గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ ఆయన కుమారుడు విష్ణు తనకు మంచి పాత్రలు ఇస్తున్నారని అన్నారు. విష్ణు అద్భుతమైన పాత్రలు పోషిస్తున్నారని ఆయన చెప్పారు.