: విష్ణు అందర్లాంటి హీరో కాదు: రాజేష్


విష్ణు ఇతర హీరోల్లా పార్టీలు, పబ్బులు అని తిరగడని హాస్యనటుడు సత్యం రాజేష్ తెలిపాడు. లక్కున్నోడు సినిమా ఆడియో వేడుకలో మాట్లాడుతూ, 'విష్ణుకి తెలిసింది సినిమా, సినిమా, సినిమా' అని చెప్పాడు. సరిగ్గా పది గంటలకు నిద్రపోయి, ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి వర్కవుట్స్ చేస్తాడని, అంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని చెప్పాడు. అలాగే సినిమాకి ఒక బడ్జెట్ అనుకుంటే అంతలోనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తాడని చెప్పాడు. అందుకే విష్ణుతో సినిమాలు తియ్యాలని చాలా మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారని అన్నాడు. విష్ణు ప్రతి ఒక్కరి సౌకర్యాలు చూస్తాడని, భేషజాలకు పోని వ్యక్తి విష్ణు అని సత్యం రాజేష్ చెప్పాడు. 

  • Loading...

More Telugu News