: ఏపీ సర్వర్ ను ఎవరూ హ్యక్ చేయలేరు... చేసినా ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు: చంద్రబాబు
ఫైబర్ గ్రిడ్ ద్వారా డిజిటలైజ్ అయిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, డిజిటలైజేషన్ దిశగా రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఏపీలో కరెన్సీ వినియోగం తగ్గించే చర్యలను విజయవంతంగా చేపట్టామని అన్నారు. రాష్ట్ర ప్రజలు కేవలం 20 శాతం కరెన్సీని వినియోగించాలని, ఆన్ లైన్, మొబైల్ బ్యాంకింగ్ దిశగా కదలాలని ఆయన చెప్పారు. ఏపీ ఆన్ లైన్ సేవలు చాలా పటిష్ఠమైనవని ఆయన అన్నారు. ఏపీ సర్వర్ ను ఎవరూ హ్యాక్ చేయలేరని, ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేసినా దానిని ఎలా పరిష్కరించాలో తమకు తెలుసని ఆయన పేర్కొన్నారు. ఆన్ లైన్ సేవలు ఏపీలో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.