: హిందువులకు క్షమాపణలు చెప్పిన ‘ద్యావుడా’ దర్శకుడు.. అభ్యంతరకర దృశ్యాల తొలగింపు!
‘ద్యావుడా’ చిత్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్న సన్నివేశాలను తొలగించామని ఆ చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సినిమా విడుదలకు ముందే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావించి ఇందులో దృశ్యాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని, ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.