: పవన్ కల్యాణ్ బిజీగా ఉండటం వల్లే ఆ ఫంక్షన్ కు రాలేకపోయాడు: చిరంజీవి
పవన్ కల్యాణ్ బిజీగా ఉండటం వల్లే ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు రాలేకపోయాడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కుటుంబ విభేదాల వల్లే పవన్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదనే ప్రశ్నను ఆయన ఖండించారు. చిన్నప్పటి నుంచి పవన్ ఎలా ఉన్నాడో, ఇప్పటికీ అలానే ఉన్నాడని, పవన్ కు మంచి ఐడియాలజీ ఉందని అన్నారు.