: బాలీవుడ్ నటుడు ఓంపురి మృతిపై సందేహాలు?
ప్రముఖ హిందీ సినీనటుడు ఓంపురి జనవరి 6న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్టులో ఆయన తలవెనుక గాయం ఉన్నట్టు తేలిందని పోలీసులు తెలిపారు. ఆయన మరణించడానికి ముందు మద్యం తీసుకున్నట్టు కూడా రిపోర్టులో వచ్చిందని పోలీసులు చెప్పారు. ఆయన చివరిసారిగా తన స్నేహితుడితో మాట్లాడారని, ఆ సమయంలో కుమారుడితో కలిసి మాట్లాడాలని భావించినట్టు ఆయన తెలిపారని పోలీసులు వెల్లడించారు. ఆయన మృతిపై అనుమానాలున్నాయని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.