: ఎమిరేట్స్ విమానంలో బెంబేలెత్తించిన పాము
మస్కట్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం అర్థాంతరంగా రద్దయింది. ఈకే 0863 విమానంలోకి ఎక్కేందుకు ప్రయాణికులు సిద్ధంగా ఉన్న సమయంలో... విమానంలో సిబ్బందికి ఓ పాము కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. దాన్ని పట్టుకునే క్రమంలో, ఏకంగా విమానాన్నే రద్దు చేశారు. ఈ క్రమంలో విమానం రద్దు కావడం పట్ల ప్రయాణికులకు క్షమాపణ చెప్పారు. ఈ మధ్యకాలంలో విమానంలో పాములు కనిపించడం తరచుగా జరుగుతోంది. ఇటీవలే మెక్సికో సిటీ, నార్తర్న్ మెక్సికోల మధ్య నడిచే ఓ విమానంలో గ్రీన్ స్నేక్ కనిపించి, ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది.