: కన్న కూతురినే అపహరించి.. తన ప్రియుడితో పెళ్లి చేసే యత్నం చేసిన మహిళ


కర్ణాటకలోని శ్రీరంగపట్టణలో ఓ మ‌హిళ దారుణ ప్ర‌య‌త్నం చేసింది. ఒక వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న‌ బెంగళూరుకు చెందిన స‌ద‌రు మ‌హిళ 12 ఏళ్ల తన కూతురిని గత నెల 14న అపహరించి మండ్య ప్రాంతానికి తీసుకొచ్చింది. తన వివాహేతర సంబంధానికి త‌న కూతురు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో తన ప్రియుడు మంజుకి ఆ బాలిక‌ను ఇచ్చి వివాహం చేసేందుకు ప్ర‌య‌త్నించింది. ఆమె చేస్తోన్న ఆ ప్ర‌యత్నం స్థానికుల కంట‌ప‌డ‌డంతో వారిని స్థానికులు అడ్డుకున్నారు. అనంత‌రం అక్క‌డి నుంచి తప్పించుకొని ఆ బాలిక బెంగళూరులోని త‌న‌ తండ్రి వద్దకు చేరుకుంది. ఆ బాలిక తండ్రి చేసిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక త‌ల్లితో పాటు మంజుని అరెస్టు చేశారు. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News