: వెంకన్నను కోరుకుని నాగార్జున తీర్చుకున్న మరో రెండు కోరికలివి!
తల్లిని అనారోగ్యపు బాధ నుంచి విముక్తి చేసే దిశగా, ఆమెను తీసుకెళ్లి పోవాలని వెంకటేశ్వర స్వామిని తొలి కోరికగా కోరుకున్న హీరో నాగార్జున, స్వామిని అడిగి మరో రెండు కోరికలను కూడా తీర్చుకున్నానని వెల్లడించారు. 'మనం' సినిమా హిట్ అవ్వాలి. ఇది నాన్న గారి లాస్ట్ ఫిల్మ్. ఏదైనా సరే హిట్ చేయండి స్వామి. నేను చేయాల్సిన పనంతా చేస్తాను... అని స్వామితో వేడుకున్నాను. అలాగే అది కూడా ప్రసాదించారు. థ్యాంక్యూ. ఈ మధ్యన ఎక్కువ ప్రసాదం ఇస్తుంటే కోరికలు పెరిగిపోతాయి కదా మనకి? అడుగుతూ ఉంటే ఇస్తుంటే, పెరుగుతూ ఉంటాయి కదా. నన్ను బాగా చూసుకున్నారు. అమలను బాగా చూసుకుంటున్నారు. అలాగే మా ఇద్దరు కొడుకులను కూడా బాగా చూసుకోండి. అబ్బాయిలను బాగా చూసుకోండి అని అడిగితే, నెల తిరిగే లోపల వాళ్లిద్దరికీ పెళ్లి అని తెలిసింది. కల్యాణం... అది తిరుపతి వెళ్లి వచ్చిన రోజే తెలిసింది. సో ఇటువంటి ఎక్స్ పీరియన్స్... బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్. ఎప్పుడూ స్వామి నాతోనే ఉంటారు" అని నాగార్జున చెప్పుకొచ్చారు.