: 'స్వామీ! అమ్మను తీసుకెళ్లు' అని వేడుకున్నాను... ఆ వెంటనే చనిపోయారన్న వార్త వచ్చింది!: భావోద్వేగంతో చెప్పిన నాగార్జున
'ఓం నమో వెంకటేశాయ' చిత్రం ఆడియో విడుదల వేదికపై నాగార్జున తన తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుని భావోద్వేగంతో మాట్లాడారు. తాను ఎప్పుడు తిరుమలకు వెళ్లినా, ఏదీ కోరుకోలేదని, ఎప్పుడూ అందరూ బాగుండాలని కోరుకునే వాడినని చెప్పారు. "చక్కటి భార్యను ఇచ్చారు, చక్కటి పిల్లలను ఇచ్చారు... థ్యాంక్యూ అని చెబుతుండే వాడిని. ఎప్పుడైనా సరే. ఫస్ట్ టైం నేను అడగడం... వెరీ సాడ్ అకేషన్... అమ్మ చాలా రోజుల నుంచి సుస్తి చేసి చాలా బాధపడుతుండేది. షీ హేజ్ కంటూ ఏ స్టేజ్... అంటే ఆల్ మోస్ట్... మన దగ్గరున్నా కూడా లేదు. రకరకాలుగా మాట్లాడటం, తన చిన్నతనం గురించి మాట్లాడటం, కిడ్నీ ఇన్ ఫెక్షన్ తో చాలా బాధపడుతుండేది.
దట్ వజ్ వన్ ఈవెనింగ్... నెక్ట్స్ డే నేను బెంగళూరు వెళ్లాలి. అమ్మను చూడడానికి వెళ్లాను. గుర్తు పట్టలేదు. మధ్య మధ్యన గుర్తు పడుతుంది. అండ్... నాన్న ముఖం చూశాను. ఆయన తెల్లబోయి ఉన్నారు. ఏమీ చేయలేక. అలాగే నేను వెళ్లాల్సి వచ్చింది. నెక్ట్స్ డే మార్నింగ్ వెళుతూ, 'వెంకటేశ్వర స్వామీ అమ్మను తీసుకెళ్లు' అని అడిగాను. ఫ్లయిట్ దిగాను.. ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చిందే అమ్మ వెళ్లిపోయిందని. థ్యాంక్యూ... థ్యాంక్యూ స్వామి" అని వెంకన్నను తాను కోరిన తొలి కోరిక గురించి చెప్పారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు నాగార్జున కళ్లు చెమర్చగా, అక్కడున్న అందరి హృదయాలూ బరువెక్కాయి.