: నాతో కలిపి అందరు అందగాళ్లు ఈ సినిమాలో నటించారు: రఘుబాబు


తనతో కలిపి అందరు అందగాళ్ళూ ఈ సినిమాలో నటించారని ప్రముఖ హాస్యనటుడు రఘుబాబు చమత్కరించారు. ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యనించగానే ఆడిటోరియం నవ్వులతో మార్మోగిపోయింది. ఈ చిత్రం మేకింగ్ చూస్తే ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారనే విషయం తెలుస్తుందని ఆయన అన్నారు. "ఈ సినిమా ఎంతగా నచ్చుతుందనేది ఒక్క మాటలో చెబుతాను.. ‘ పేదవాళ్లు, ముసలి వాళ్లు, తిరుమలకు వెళ్లలేని వాళ్లు ఈ సినిమా చూసి తరించే అవకాశం తప్పకుండా ఉంటుందని నా అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం" అన్నారు.

  • Loading...

More Telugu News