: చిరంజీవికి పవన్, చరణ్, సాయి ధరమ్, వరుణ్, బన్నీ వంటి సానుకూలతలను ఇచ్చిన దేవుడు.. బ్యాలెన్స్ కోసం నాగబాబునూ ఇచ్చాడు!: రాంగోపాల్ వర్మ నేటి ట్వీట్లు
"చిరంజీవి కుటుంబానికి పవన్ కల్యాణ్, రాంచరణ్, సాయి ధరమ్, వరుణ్, బన్నీ వంటి సానుకూలతలను ఇచ్చిన దేవుడు... బ్యాలెన్స్ కోసం నాగబాబు గారిని ఇచ్చాడు" అని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. గత రాత్రి కురిపించిన ట్వీట్ల వర్షాన్ని కొనసాగిస్తూ, పలువురు ప్రముఖులు పెట్టిన కోట్స్ ను ప్రస్తావించాడు. "గాజు అద్దాల్లో నివసిస్తున్న వారు ఇతరులపై రాళ్లు విసరకూడదు - భగవద్గీత", "జీవితంలో విఫలమైన వాళ్లు ఇతరులను విమర్శించడం అంటే, తుపాను ముందు నోటితో గాలిని ఊదినట్టే - ఫ్రాంక్లిన్ ఫోయర్" అని ట్వీట్లు పెట్టాడు. చిరంజీవి అభిమాని ఒకరు 'రౌడీ నంబర్ 150' అంటూ తనపై తయారు చేసిన పోస్టరును షేర్ చేశాడు రాంగోపాల్ వర్మ.