: అన్న మెగాస్టార్ కదా అని 'వాడు, వీడు' అంటే సైలెంట్ గా ఉండాలా?: రాంగోపాల్ వర్మకు ఓ వైపు మద్దతు, మరో వైపు విమర్శలు


నిన్నటి ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాంగోపాల్ వర్మపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు, ఆపై రాంగోపాల్ వర్మ రెచ్చిపోయి ట్వీట్లు పెట్టడంపై ఇప్పుడు సినీ అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. వర్మ శ్రుతిమించుతున్నాడని మెగా ఫ్యాన్స్ అంటుంటే, వర్మకు మద్దతుగానూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారు. తన అన్న మెగాస్టార్ అని చెప్పి, వాడు వీడు అంటుంటే, సైలెంట్ గా ఉండటానికి రాంగోపాల్ వర్మ వేరెవరి ఫ్యానో కాదని అంటున్నారు. తనను విమర్శిస్తే స్పందించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని చెబుతున్నారు. ఇక వర్మకు వ్యతిరేకంగానూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. హిట్లు లేని ఆయన జయాపజయాలపై హితబోధలు చేసేదేంటని అంటున్నారు. ట్వీట్ల వేదికగా సాగుతున్న యుద్ధం ఎంతవరకూ వెళుతుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News